ఏమున్నా లేకున్నా – Emunna Lekunna
ఏమున్నా లేకున్నా – Emunna Lekunna
Song Lyrics :
పల్లవి:-
ఏమున్న లేకున్న – ఏదేమైనా ప్రభువా
అర్పిస్తానేసయ్యా నా జీవితాన్ని
నీవుంటే చాలయ్య – ఎవరున్న లేకున్న
వినిపిస్తా నీ స్వరము సర్వలోకానికి
అ!!ప!! :-
నడిపించు యేసయ్యా – నీ ఆత్మతో నన్ను
బలపరచుము నా తండ్రి – నీ శక్తితో నన్ను
నా కొరకై – నీవుంటే ఇక చాలును యేసయ్యా !! ఏమున్న!!
చరణం:- 1
లోకములో నేను పడిఉండగా – నన్ను పిలచితివి
నిరాశలో నేనుండగా – లేవనెత్తితివి !!2!! !!నడిపించు!!
చరణం :-2
ఆత్మీయులే నన్ను విడనాడినా – ఆదరించితివి
అనాధగా నేనుండగా – చేరదీసితివి !!2!! !! నడిపించు !!