Viswavikyathuda Naa Yesayya song lyrics – విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా

Deal Score0
Deal Score0

Viswavikyathuda Naa Yesayya song lyrics – విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా

క్షేమా క్షేత్రమా – నడిపించే మిత్రమా
విడిపోని బంధమా – తోడున్న స్నేహమా II2II
మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా
నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా II2II
II క్షేమా క్షేత్రమాII
విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా
నా నిత్యారాధన నీకే యేసయ్యా II2II

సదా నిలుచు నీ ఆలోచనలు
మారిపోవు నీ సంకల్పములు
స్థిరమైనవి నీ కార్యములు
సుస్థిరతను కలిగించును II2II
నీ బసలో భాగస్వామిగా నను చేర్చి
సదా నడిపించుము నీ సంకల్పముతో II2II


IIవిశ్వవిఖ్యాతుడా II
అనుదినము నీ వాత్సల్యమే
నీతో అనుబంధమే పెంచెను
నీదయ నా ఆయుష్కాలమై
కృపా క్షేమము కలిగించెను II2II
కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే
సదా నడిపించుము నీ సేవలో II2II


IIవిశ్వవిఖ్యాతుడా II
నడిపించుము నా కాపరివై
ఈ ఆత్మీయ యాత్రలో
తొట్రిల్లనీయక నను నీవు
స్థిరచిత్తము కలిగించుము II2II
ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై
సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో II2II
IIవిశ్వవిఖ్యాతుడా II

    Jeba
        Tamil Christians songs book
        Logo