1. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
2. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
4. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
5. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
6. నరహత్య చేయకూడదు.
7. వ్యభిచరింపకూడదు.
8. దొంగిలకూడదు.
9. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
10. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.