Dayagala Yesu Prabhu Neevu krupa gala devudavu

దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు ||2||
పాపము శాపము దోషములను తొలగించిన దేవుడవు
కష్టము నష్టము రోగములను తీర్చేసిన హృదయడవు ||2||
దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు..||2||

మాది తొలిచే దోషమైనను
బాధ నొసగు వ్యాధినైనను
కలత రేపు కష్టమైనను
నీ కృపలో తొలగి పోవును.. ||2||

చీకటి బాటలో వెలుగు నింప తెలిసిన సూర్యుడవు
వంకర త్రోవలు చక్కగా చేసి చూపిన నాధుడవు ||2||
మేమెరుగక మునుపే మా కొరకై నీ ప్రాణమర్పించున్నావు.
దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు..||2||

దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు ||2||
పాపము శాపము దోషములను తొలగించిన దేవుడవు
కష్టము నష్టము రోగములను తీర్చేసిన హృదయడవు ||2||
దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు..||2||

చేవలేని జీవికైనను
కదలలేని మోడుకైనను
జ్ఞానహీన ప్రాణికైనను
నీ యొద్ద మేలు దొరుకును ||2||

మార్గము సత్యము జీవము మాకు నీవై ఉన్నావు
బలము తెలివి సామర్ధ్యము కలిగించే దేవుడవు ||2||

దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు ||2||
పాపము శాపము దోషములను తొలగించిన దేవుడవు
కష్టము నష్టము రోగములను తీర్చేసిన హృదయడవు ||2||
దయగల యేసు ప్రభో నీవు కృప గల దేవుడవు..||2||

Leave a Comment

error: Download our App and copy the Lyrics ! Thanks