ఆర్భాట స్తుతి ధ్వని || 83 rd Bible Mission Conventions 83 Stanza

ఆర్భాట స్తుతి ధ్వని  || 83 rd Bible Mission Conventions 83 Stanza .

మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! – 1 కొరింథి 16:22​, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి – యోహను 2 : 5

ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.

Bible mission పరిచర్య
“ముంగమూరి దేవదాసు” అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు….
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల “సూది కొండ” అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.

దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత

Leave a Comment Cancel Reply

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version