Okapari Thalachina – ఒకపరి తలచిన యేసుని

Deal Score+1
Deal Score+1

Okapari Thalachina – ఒకపరి తలచిన యేసుని

పల్లవి : ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం

1:నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును

2:శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo