ముల్లోకాలను ఎలే మహోన్నతుడా – Mullokalanu Yele Mahonnathuda

Deal Score+1
Deal Score+1

ముల్లోకాలను ఎలే మహోన్నతుడా – Mullokalanu Yele Mahonnathuda

ముల్లోకాలను ఎలే – మహోన్నతుడా
పరమందున్న నీవు – పరిశుద్దుడావు
నీకు సాటి ఇలలో – ఎవరు లేరయ్యా
నీ బలము ఇలలో – ఎవరికి ఉందయ్యా

1చ . ఐగుప్తునుండి నీ – ప్రజలను విడిపించి
అరణ్య మార్గమును – నీవు నడిపించి
పగలేమో – మేఘస్తంభముగ •••
రాత్రేమో – అగ్నిస్తంభముగ •••
వెంటుండి – నడిపించినావు
నీ మహిమను – కనుపరిచినావు
స్తుతి గణా మహిమలు – నీకే మా దేవా

2 చ .ఎవరు విడిపించలేని – పాపములో నుండి
సాతాను బిగించిన – బంధకాల నుండి
నన్ను నీవు – రక్షించావయ్య
పరిశుద్ధ – పరిచినావయ్య
నీ వాక్యము – నా బ్రతుకున వెలుగై
నీ మాటలతో నన్ను – బ్రతికించా వయ్యా
స్తుతి గణ మహిమలు- నీకే మా దేవా

    Jeba
        Tamil Christians songs book
        Logo