Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

Deal Score+1
Deal Score+1


Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
ఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా “2”
తూర్పు దిక్కు చుక్క మెరిసే లే
చిన్నారి ఏసు జాడ తెలిపెలే
బెత్లహేము సంతోషించే లే
రక్షకుండు యిల జన్మించే లే
బంగారు సామ్రాణి భోలంబు తెచ్చా మే
మనసారా బాల ఏసు ని సుత్తి ఇంప వచ్చామే
ఊరంతా సంబర మాయే లే
రండి రండి పోదాము రారాజు ని చూద్దాము
రండి రండి పోదాము తరి ఇద్దాము “2”

దివినుండి దూతలు వచ్చి భయపడవద్ద అన్నారే
ఈ భూవికి కలుగబోవు శుభవార్తను తెలిపారే
అది విన్న గొల్లలు పరుగున ఏసయ్యను చేరారే
పాటలతో నాట్యం తో ప్రభువుని కీర్తించారే
రక్షకుడు ఏసయ్యే రారాజు గా వచ్చాడే
చిన్న పెద్ద అంతా కలిసి పూజిద్దాం రారండోయ్ “2”
రండి రండి…..

చిరునవ్వుల చిన్ని యేసు చిత్రంగా భువి చేరెలే
పశువుల పాకే నేడు పరలోక సన్నిదాయే
దినుడిగా ఉదయించాడే మహిమత్వం విడిచాడే
తన ప్రేమను మనకై చూప దయతో దిగి వచ్చాడే
పరమే విడిచి నీకై నాకై నరుని గ వచ్చాడే
చీకు చింతలు పాపం పోవును పూజిద్దాం రారండోయ్ “2”
రండి రండి పోదాము రారాజు……

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo