
Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు
పల్లవి:
ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు నాయేసుతో స్నేహం నన్ను చేర్చును
నా పాపం తుడిచెను యేసు-నా దోషం కడిగెను యేసు
నన్ను నన్నుగా ప్రేమించెను ||2||
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస ||ఆనందం||
1.కాదు ఇది కాదు అని నీరసించి
జరుగదు ఇది జరుగదు అని కృంగిపోయావు ||2||
నీవుంటే నాతోడు ఇంకెవ్వరు సరిరారు –
చూశాను మహత్యము-కాదేది అసాధ్యము ||2||
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస ||ఆనందం||
2. లేరు నాకెవ్వరూ అని నీరసించి
రారు ఇంకెవ్వరూ అని కృంగిపోయాను
నీవుంటే నాచెంత కానెన్నడు అనాధను
అంధకారమైననూ నీతో వెలుగే కదా ॥2॥
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస
యేసే నా శ్వాస యేసే నా ధ్యాస ||ఆనందం|