Christmas Subhavelalo 2 christmas song lyrics – క్రిస్మస్ శుభవేళలో మన అందరి

Deal Score0
Deal Score0

Christmas Subhavelalo 2 christmas song lyrics – క్రిస్మస్ శుభవేళలో మన అందరి

క్రిస్మస్ శుభవేళలో – మన అందరి హృదయాలలో
ఆనందమానందమే – మనసంతా సంతోషమే-2

“స్తుతియించి ఆరాదిద్దాం – ఆ ప్రభుని
ఘనపరచి కీర్తించుదాం
రక్షకుడు పుట్టాడని – మనకు రక్షణ తెచ్చాడని “

దావీదు పురమందు రక్షకుడు
మన కొరకై జన్మించాడు
దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు -2
ఆ ప్రభువే నరుడాయెను – లోకమును ప్రేమించెను
మన పాపము తొలగించెను – పరిశుథ్థులుగా చేసెను-2
||స్తుతియించి||
సర్వోన్నతమైన స్థలములలో – దేవునికే మహిమ
ఆనందమే ఆశ్చర్యమే – సంతోషం సమాధానమే -2
దూతాళి స్త్రోత్రించిరి – కాపరులు చాటించిరి
ప్రభుయేసు పుట్టాడని – మనకు తోడై ఉంటాడని-2
||స్తుతియించి||
వింతైన తార వెలసిందని – ఙ్ఞానులు కనుగొంటిరి
ఆ తార వెంబడి వారొచ్చిరి – ప్రభుయేసుని దర్శించిరి 2
రాజులకే రాజని – ప్రభువులకే ప్రభువని
కానుకలు అర్పించిరి – వినమ్రతతో పూజించిరి-2
||స్తుతియించి||

    Jeba
        Tamil Christians songs book
        Logo