Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను

Deal Score+2
Deal Score+2

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను

దేవుడు చేసిన మేలులను గ్యపకము చేసుకొని ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము…
ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక…
ఆమెన్
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)
యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) ” నీ చల్లని”

1) నా భుజములపై చేయి వేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2)
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో
కంటి పాపగ నను కాపాడితివి (2) ” యేసయ్యా”

2) నా బలహీనతలో బలమై నిలచితివి
చీకు చింత వద్దని నాతో ఆంటీవి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో
మంచి కాపరివై నను కాపాడితివి (2) ” యేసయ్యా”

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo